
ఏమాయ చేసావె సినిమా గురించి ప్రత్యేకంగా చెపాల్సిన పనిలేదు. నాగ చైతన్య, సమంత జంటగా నటించిన ఆ సినిమాతో సమంత టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత స్టార్ హీరోయిన్ అయ్యింది. అంతేకాదు ఆ సినిమాతోనే చైతు, సామ్ ల మధ్య ప్రేమ చిగురించింది. ఇద్దరు కొన్నాళ్లు ప్రేమించుకుని 2017లో పెళ్లి చేసుకున్నారు. ఇంతకీ ఇప్పుడు ఇదంతా ఎందుకు చెబుతున్నట్టు అంటే 9 ఏళ్ల క్రితం సరిగ్గా ఇదే రోజు ఏమాయ చేసావె సినిమా రిలీజైంది.
ఈ సందర్భంగా ఈ చిత్ర నిర్మాత మంజుల తొమ్మిదేళ్లయింది.. అయినా నిన్ననే జరిగినట్టుంది.. ఈ సినిమా కోసం పనిచేసిన వారందరికి మరోసారి అభినందనలు తెలిపుతూ ట్వీట్ చేశారు. మంజుల ట్వీట్ కు రిప్లై ఇస్తూ నా జీవితాన్ని మార్చేసిన అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్స్ అంటూ సమంత ట్వీట్ చేసింది. అభిమానులకు కూడా ఈ సందర్భంగా థ్యాంక్స్ చెబుతూ మీరు లేకపోతే నటిగా నాకు ఈ స్థానమే లేదు అంటూ మెసేజ్ పెట్టింది.
ఇక పెళ్లి తర్వాత కూడా సమంత కెరియర్ ఫుల్ జోష్ లో ఉంది. ప్రస్తుతం తెలుగులో మజిలి, ఓ బేబి ఎంత సక్కగున్నావేతో పాటుగా తమిళంలో సూపర్ డీలక్స్ సినిమాలో నటిస్తుంది సమంత.