
విజయ్ దేవరకొండ హీరోగా వచ్చిన టాక్సీవాలా సినిమా ద్వాతా తెలుగు పరిశ్రమకు పరిచయమైన అమ్మడు ప్రియాంకా జవల్కర్. తెలుగు అమ్మాయి అయిన ప్రియాంకా టాక్సీవాలా సినిమాతో రాణించగా ఆమెకు ఇప్పుడు వరుస అవకాశాలు వస్తున్నాయి. మాస్ మహరాజ్ రవితేజ సినిమాలో ఛాన్స్ దక్కించుకుందని తెలుస్తుండగా లేటెస్ట్ గా అక్కినేని హీరో అఖిల్ సినిమాలో ప్రియాంకా హీరోయిన్ గా సెలెక్ట్ అయ్యిందని తెలుస్తుంది.
అఖిల్ తన తర్వాత సినిమా బొమ్మరిల్లు భాస్కర్ డైరక్షన్ లో రాబోతుంది. గీతా ఆర్ట్స్ నిర్మిస్తున్న ఈ సినిమాలో హీరోయిన్ గా ప్రియాంకా జవల్కర్ నటిస్తుందట. ఇది కచ్చితంగా ప్రియాంకాకు లక్కీ ఛాన్స్ అని చెప్పొచ్చు. రీసెంట్ గా మిస్టర్ మజ్ను అంటూ ప్రేక్షకులను పలుకరించిన అఖిల్ ఆ సినిమాతో కూడా నిరాశపరచగా బొమ్మరిల్లు భాస్కర్ సినిమాపై అంచనాలు పెట్టుకున్నాడు.