బయోపిక్ ప్రస్థావన లేకుండా మాట్లాడిన ఎన్.టి.ఆర్..!

సోమవారం సాయంత్రం జరిగిన కళ్యాణ్ రాం 118 పీ రిలీజ్ ఈవెంట్ కు చీఫ్ గెస్టులుగా నందమూరి బాలకృష్ణ, యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్ అటెండ్ అయ్యారు. ఈ వేడుకలో బాలకృష్ణ స్టేజ్ మీద ఉండగా తారక్ ఏం మాట్లాడతాడు అన్న విషయమై డిస్కషన్స్ పెట్టారు. ఎన్.టి.ఆర్ బయోపిక్ సినిమాపై ఎలాంటి కామెంట్ చేయని తారక్ ఈ వేడుకలో బయోపిక్ ప్రస్థావన తెస్తాడని అనుకున్నారు కాని అసలు బయోపిక్ ఊసెత్తకుండా తన స్పీచ్ కానిచ్చేశాడు తారక్.

ఇక అన్న కళ్యాణ్ రాం ఎప్పుడు కొత్తదనం కోసం ప్రయత్నించే నటుడని.. అంతగా కష్టపడే వ్యక్తి మరొకరు ఉండరేమో అని అన్నాడు తారక్. 118 సినిమా తాను చూశానని నివేదా నటించిన ఓ సీన్ తనకు కన్నీళ్లు తెప్పించిందని.. షాలిని పాండే కూడా సినిమాకు తన ఎఫర్ట్ పెట్టిందని అన్నారు. దర్శకుడు గుహన్ గురించి చెబుతూ తనతో బాద్షా టైంలో బంతిపూల జానకి సాంగ్ కోసం మైనస్ డిగ్రీల చలిలో నాలుగు రోజులు గుహన్ కష్టపడి ఆ పాట షూట్ చేశారని.. ఈ సినిమా కూడా అంతే అద్భుతంగా తెరకెక్కించారని అన్నారు. ఈ సినిమా తప్పకుండా విజయం సాధించాలని కోరుకున్నారు.