
విక్రం కుమార్ డైరక్షన్ లో నాని 24వ సినిమాగా వస్తున్న సినిమాకు టైటిల్ గా గ్యాంగ్ లీడర్ అని ఫిక్స్ చేశారు. మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణంలో వస్తున్న ఈ సినిమా ఓ ఐదుగురు ఆడావాళ్ల గ్యాంగ్ కు లీడర్ గా నాని నటిస్తున్నాడు. అయితే గ్యాంగ్ లీడర్ టైటిల్ అంటే మెగాస్టార్ చిరంజీవి మాస్ మూవీ గుర్తుకు వస్తుంది. అలాంటి గ్యాంగ్ లీడర్ టైటిల్ ను నాని లాంటి హీరో సినిమాకు పెట్టడం వల్ల కొన్ని అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. ముఖ్యంగా మెగా ఫ్యాన్స్ ఈ టైటిల్ మెగా హీరోలకు సొంతం అన్నట్టుగా తమ కామెంట్స్ తో నానిని టార్గెట్ చేస్తున్నారు.
ఇదిలాఉంటే నా పేరు సూర్య తర్వాత విక్రం కుమార్ అల్లు అర్జున్ తో కొన్నాళ్లు ట్రావెల్ చేశాడు. ఇప్పుడు నానితో చేయాల్సిన కథనే బన్నితో చేయాల్సిందని అంటున్నారు. ఈ కథ అనుకున్నప్పుడు గ్యాంగ్ లీడర్ టైటిల్ అనుకున్నారట. అనుకోవడమే కాదు వెంటనే రిజిస్టర్ చేయించారట. అయితే తన ఇమేజ్ కు ఇలా లేడీస్ సెంటిమెంట్ వర్క్ అవుట్ అవుతుందో కాదో అని బన్ని ఈ ప్రాజెక్ట్ నుండి డ్రాప్ అయ్యాడు. అయితే హీరో మారాడు కాని సినిమాకు అనుకున్న టైటిల్ మారలేదు. అలా బన్ని కావాల్సిన గ్యాంగ్ లీడర్ నాని అయ్యాడన్నమాట. ఏది ఏమైనా గ్యాంగ్ లీడర్ అంటే మాస్ ఇమేజ్ ఉన్న హీరోకి తగిన టైటిల్ మరి నాని లాంటి క్లాస్ హీరోకి ఈ టైటిల్ ఎలా సూట్ అవుతుందో చూడాలి.