
ప్రపంచవ్యాప్తంగా జరిగే సినిమా వేడుక అంటే ఆస్కార్ అకాడెమీ అవార్డులే. 90 ఏళ్లుగా నిరంతరాయంగా ఈ అవార్డుల వేడుక జరుగుతున్నాయి. ఇక లేటెస్ట్ గా 91వ ఆస్కార్ అవార్డుల వేడుక లాస్ ఏంజిల్స్ లో జరిగింది. 24 విభాగాల్లో మొత్తం 52 సినిమాలు బరిలో దిగాయి. విశేషం ఏంటంటే ఈ ఇయర్ ఆస్కార్ అవార్డుల్లో ఇండియన్ డాక్యుమెంటరీ మూవీకి ఆస్కార్ లభించింది.
పీరియడ్.. ఎండ్ ఆఫ్ సెంటెన్స్ డాక్యుమెంటరీకి ఆస్కార్ అవార్డ్ లభించింది. ఆడవాళ్లు పీరియడ్ టైంలో ఎదుర్కునే సమస్యల గురించి ఈ డాక్యుమెంటరీలో చూపించారు. రేకా జెహ్తాబ్చి డైరెక్ట్ చేసిన ఈ డాక్యుమెంటరీ ఉత్తరప్రదేశ్లోని హపూర్ పరిసర ప్రాంతాల్లో తెరకెక్కించారు. ఆ ప్రాంతానికి చెందిన మహిళలు బయోడీగ్రేడబుల్ న్యాప్ కీన్స్ తయారు చేసి వాటిని ఇతర మహిళలకు తక్కువ రేటుకి అమ్మేస్తారు. ఈ కథతో తీసిన పీరియడ్ డాక్యుమెంటరీ అకాడెమీ అవార్డ్ అందుకుంది.
ఇక ఈసారి అవార్డ్ వేడుక యాంకర్స్ ఎవరు లేకుండానే మ్యూజిక్ ప్లే చేస్తూ ఈవెంట్ జరిపారు. హాలీవుడ్ సినిమాలు రోమా, బ్లాక్ పాంథర్ సినిమాలకు ఎక్కువ అవార్డులు వరించాయి.