
సినిమాలో కొన్ని అద్భుత దృశ్యాలు చూసి అబ్బో.. ఆహా.. ఓహో అని మనం అనుకుంటాం.. అయితే ఆ అద్భుతాల వెనుక సీక్రెట్ తెలిస్తే మాత్రం ముక్కున వేలేసుకుంటారు. తెర మీద అంత బిల్డప్ తో కనిపించే యాక్సెన్ సీన్స్ అన్ని నాలుగు గోడల మధ్య గ్రీన్ మ్యాట్ మీద చేసినవే అని తెలిస్తే ఆడియెన్స్ షాక్ అవడం ఖాయం. వీటిల్లో క్లోజ్ యాంగిల్స్ లోనే హీరోలు నటిస్తారు రిస్క్ ఏదైనా ఉందంటే మళ్లీ డూపులే వారికి దిక్కు.
అయితే ఈ వ్యవహారమంగా ప్రేక్షకులకు తెలియదు కాబట్టి సినిమాను ఎంజాయ్ చేస్తారు. అయితే లేటెస్ట్ గా కంగనా రనౌత్ నటించి, డైరెక్ట్ చేసిన మణికర్ణిక సినిమా నుండి ఓ వీడియో రిలీజైంది. హార్స్ రైడింగ్ చేసే దృశ్య షూట్ చేస్తుండగా ఎలెక్ట్రిక్ హార్స్ మీద కంగనా రనౌత్ హార్స్ రైడ్ చేస్తున్నట్టుగా బిల్డప్ ఇవ్వడం ఆ వీడియోలో ఉంది. వీడియో చూసిన ప్రేక్షకులు షాక్ అవడమే కాదు సినిమా కోసం తాము హార్స్ రైడింగ్ కూడా నేర్చుకున్నామని చెప్పిన సెలబ్రిటీస్ మాటలన్ని ఒట్టి మాటలే అన్నమాట అంటూ కామెంట్స్ చేస్తున్నారు.
మణికర్ణిక సినిమా నుండి బయటకు వచ్చిన ఈ మేకింగ్ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. సినిమా మేకింగ్ చూసి సినిమా చూస్తే ఇదంతా ఎంత డూపు అన్నది అర్ధమవుతుంది. అయినా సరే ఆడియెన్స్ ఇవేమి పట్టించుకోరు లేండి.. సినిమా నచ్చిందా హిట్ చేశామా అన్నదే వారి లెక్క.