బయోపిక్ వద్దని ముందే చెప్పారట..!

ఎన్.టి.ఆర్ బయోపిక్ గా వచ్చిన రెండు పార్టులు ప్రేక్షకులను మెప్పించలేదు. కథానాయకుడు అయినా కాస్త కూస్తో బాగుందన్న టాక్ వచ్చింది. కాని మహానాయకుడు అది కూడా లేదు. అయితే శుక్రవారం మరణించిన దర్శకుడు కోడి రామకృష్ణ ఎన్.టి.ఆర్ బయోపిక్ రిజల్ట్ ముందే ఊహించారట. శతచిత్ర దర్శకుడైన కోడి రామకృష్ణ బయోపిక్ సినిమాల జోలికి మాత్రం వెళ్లలేదు. అవంటే ఆయనకు అంతగా ఇష్టం ఉండదట. 

దానికి ఓ కారణం ఉంది.. మహనీయుల జీవితాల గురించి సినిమాగా చెప్పేప్పుడు కొన్ని వ్యక్తిగత విషయాలను ప్రస్థావించాల్సి ఉంటుంది. అవి ఆడియెన్స్ సరిగా రిసీవ్ చేసుకోకుంటే గొప్ప వారికి విమర్శలు వస్తాయి అందుకే బయోపిక్ సినిమాలు తీయనని అప్పట్లో ఓ ఇంటర్వ్యూలో చెప్పారు కోడి రామకృష్ణ. అయితే ఎన్.టి.ఆర్ బయోపిక్ బాలకృష్ణ చేయడం గురించి తండ్రికి తగ్గ తనయుడు కాబట్టి ఎన్.టి.ఆర్ జీవితాన్ని తెర మీద బాలకృష్ణ గొప్పగా చూపిస్తాడని అన్నారు. 

కాని కోడి రామకృష్ణ ఊహించినట్టుగానే ఎన్.టి.ఆర్ జీవితాన్ని తెర మీద చూడలేకపోయారు ప్రేక్షకులు. తీసిన దర్శకుడిది తప్పా.. లేక నటీనటులదా అన్నది పక్కన పెడితే. ఎన్.టి.ఆర్ అభిమానులకు ఓ కానుకగా ఉండిపోవాల్సిన ఎన్.టి.ఆర్ బయోపిక్ రెండు పార్టులు చేదు అనుభవాన్ని మిగిల్చాయి. ఈ సందర్భంగా కోడి రామకృష్ణ చెప్పినట్టుగా అసలు ఎన్.టి.ఆర్ బయోపిక్ జోలికి వెళ్లకుండా ఉంటే బాగుండేదని కొందరు అభిప్రాయ పడుతున్నారు.