దర్శకుడు కోడి రామకృష్ణ ఇక లేరు

శతచిత్ర దర్శకుడు కోడి రామకృష్ణ అకాల మరణం సిని పరిశ్రమను దిగ్బ్రాంతికి గురి చేస్తుంది. గురువారం హాస్పిటల్ లో చేరిన కోడి రామకృష్ణ ఈరోజు మరణైంచడం జరిగింది. కొన్నాళ్లుగా ఊపిరితిత్తుల వ్యాధితో బాధపడుతున్న కోడి రామకృష్ణ ఈరోజు తుది శాస విడిచారు. గచ్చిబౌలి ఏ.ఐ.జి హాస్పిటల్ లో ట్రీట్మెంట్ తీసుకుంటుండగానే కోడి రామకృష్ణ మరణించారని తెలుస్తుంది.

పాలకొల్లు నుండి వచ్చిన కోడి రామకృష్ణ ఇంట్లో రామయ్య వీధిలో కృష్ణయ్య సినిమా ద్వారా పరిశ్రమకు పరిచయం అయ్యారు. దాసరి నారాయణ రావు శిష్యుడిగా ఆయన దగ్గర అసిటెంట్ డైరక్టర్ గా చేసిన కోడి రామకృష్ణ గురువుతో సమానంగా 100 సినిమాలను పూర్తి చేశారు. ఫాంటసీ సినిమాలకు కేరాఫ్ అడ్రెస్ అంటే కోడి రామకృష్ణ అని తెలిసిందే. అమ్మోరు, దేవి, దేవుళ్లు, అరుంథతి సినిమాలు ఆయన దర్శకత్వంలో వచ్చిన సినిమాలు. కోడి రామకృష్ణ మరణం సిని పరిశ్రమకు షాక్ ఇచ్చింది. ఆయన మరణ వార్త విని సిని ప్రముఖులు కోడి రామకృష్ణ కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియచేస్తున్నారు.