
సినిమాల ఫలితాలతో సంబంధం లేకుండా వరుసగా సినిమాలు చేస్తున్నాడు బెల్లంకొండ శ్రీనివాస్. ప్రస్తుతం తేజ డైరక్షన్ లో సీత సినిమా చేస్తున్న బెల్లంకొండ శ్రీనివాస్ తమిళ సూపర్ హిట్ మూవీ రాక్షసన్ రీమేక్ చేస్తున్నాడు. రమేష్ వర్మ డైరక్షన్ లో రీమేక్ అవుతున్న రాక్షసన్ తెలుగు మూవీ ఈరోజు సెట్స్ మీదకు వెళ్లింది. సినిమా అంటే ప్యాషన్ ఉన్న హీరో అనుకోకుండా పోలీస్ అవడం.. ఓ సైకో కిల్లర్ కేసుని ఎలా డీల్ చేశాడు అన్నది రాక్షసన్ కథ.
చిన్న సినిమాగా రిలీజై తమిళంలో సూపర్ హిట్టైన రాక్షసన్ తమిళ సినిమాలో విష్ణు విశాల్ హీరోగా నటించగా అమలా పాల్ హీరోయిన్ గా చేసింది. అయితే తెలుగు రాక్షసన్ లో బెల్లంకొండకు జోడీ కట్టేది ఎవరన్నది ఇంకా నిర్ణయించలేదు. ఈ సినిమాను కోనేరు సత్యనారాయణ నిర్మిస్తున్నారు. కవచం ఫ్లాప్ తర్వాత సీతతో వస్తున్న బెల్లకొండ శ్రీనివాస్ ఈ రాక్షసన్ తో అయినా హిట్ అందుకుంటాడా లేదా అన్నది చూడాలి.