
ఎన్.టి.ఆర్ బయోపిక్ తర్వాత క్రిష్ ఏం సినిమా చేస్తున్నాడు.. ఎవరితో డిస్కషన్స్ చేస్తున్నాడు. క్రిష్ డైరక్షన్ లో హీరో సినిమా ఉంటుంది అన్నది ఇప్పటిదాకా తెలియలేదు. ఎన్.టి.ఆర్ బయోపిక్ రెండు పార్టులను పూర్తి చేసిన క్రిష్ తన బాధ్యత తీర్చుకున్నాడు. శుక్రవారం రిలీజ్ అవుతున్న ఎన్.టి.ఆర్ మహానాయకుడు మీద అంచనాలు ఉన్నాయి. అయితే ఈ సినిమా తర్వాత క్రిష్ తన సొంత బ్యానర్ లో ఓ సినిమా డైరెక్ట్ చేస్తాడని తెలుస్తుంది.
ఇక ఆ సినిమా తర్వాత బాహుబలి నిర్మాతలతో ఓ ప్రయోగాత్మక సినిమా చేస్తాడని అంటున్నారు. ఆర్కా మీడియాలో తెరకెక్కిన బాహుబలి సినిమా ఎలాంటి సంచలనాలు సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. రాజమౌళి తర్వాత క్రిష్ తో బాహుబలి నిర్మాతలు సినిమా చేస్తున్నారు. అయితే ఆ సినిమా జానర్ ఏంటి.. కథ ఎలా ఉంటుంది అన్నది ఇంకా బయటకు రాలేదు. స్క్రిప్ట్ ఫైనల్ చేయగా మరో 6 నెలల్లో ఆ ప్రాజెక్ట్ సెట్స్ మీదకు వెళ్తుందని ఫిల్మ్ నగర్ టాక్.