దెయ్యంగా మారనున్న నిహారిక

మెగా ఫ్యామిలీ నుండి వచ్చిన మొదటి హీరోయిన్ గా నిహారికకు మంచి గుర్తింపు ఉంది. ఆమె సినిమాల కంటే ముందు బుల్లితెరపై టివి షోలకు యాంకరింగ్ చేసింది. తర్వాత ఒక మనసు సినిమాతో వెండితెరకు పరిచయం అయింది. చేసింది మొదటి సినిమా అయినా కూడా మంచి మార్కులు కొట్టేసింది నిహారిక. కానీ ఒక మనసు సినిమా కమర్షియల్ గా సక్సెస్ కాలేదు. దాంతో నిహారిక రెండో సినిమాపై క్లారిటీ లేకుండా పోయింది. కానీ తాజాగా ఓ సినిమాను ఓకే చేసినట్లు తెలుస్తోంది. 

నిహారిక తన రెండో సినిమా కోసం 'ఆత్మ' పాత్రను పోషించనున్నట్టుగా ఒక వార్త ఫిల్మ్ ఇండస్ట్రీలో షికారు చేస్తోంది. మరాఠీ మూవీ 'హ్యాపీ జర్నీ'ని బెక్కం వేణుగోపాల్ నిర్మాతగా తెలుగులో రీమేక్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారట. అన్నాచెల్లెళ్ల అనుబంధం నేపథ్యంగా ఈ కథ కొనసాగుతుందని అంటున్నారు. కొన్ని కారణాల వలన చనిపోయిన చెల్లెలు, ఆత్మగా అన్నయ్యతో ఉంటూ అతనికి సహకరిస్తూ ఉంటుందట. ఆత్మ పాత్రకి నటన పరంగా ఎంతో అవకాశం ఉండటంతో, ఈ పాత్రలో నటించడానికి నిహారిక గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని టాక్ . అన్నయ్య పాత్రలో హర్షవర్ధన్ రాణే నటించనున్నట్టు సమాచారం. త్వరలోనే ఈ సినిమాకి సంబంధించిన పూర్తి వివరాలు వెల్లడి కానున్నాయి.