
స్టార్ హీరోల వారసత్వం పుచ్చుకుంటూ వరుసగా వారసులే హీరోలవుతున్న సమయంలో, అందరి వారసులకంటే భిన్నమైన మార్గాన్ని ఎంచుకున్నాడు నందమూరి బాలకృష్ణ కుమారుడు మోక్షజ్ఞ.
అందరిలాగా కమర్శియల్ ఉచ్చులో ఇరుక్కోకుండా తన తండ్రి బాటలో పయనిస్తూ, తెలుగులో వచ్చిన ఏకైక సైన్స్ ఫిక్షన్ సినిమా ఆదిత్య 369 సినిమా సీక్వెల్ లో మనోడు నటిస్తున్నాడు. ఈ విషయాన్ని అధికారికంగా, చిత్ర దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు ఈరోజు ప్రకటించారు. ఆదిత్య 369 సినిమా విడుదలై ఈరోజుకి 25 సంవత్సరాలు పూర్తయిన సందర్బంగా, ఒక టీవీ ఇంటర్వ్యూ లో భాగంగా, ఆయన ఈ ప్రకటన చేశారు.
ఆదిత్య 999 అనే టైటిల్ తో వచ్చే ఈ సీక్వెల్ లో ఎప్పటిలాగే, బాలకృష్ణ మెయిన్ రోల్ లో నటిస్తారు, ఒక ముఖ్యమైన పాత్రలో మోక్షజ్ఞ తెరపైకి మొదటిసారి పరిచయమవుతారు. ప్రస్తుతం క్రిష్ దర్శకత్వంలో గౌతమిపుత్ర శాతకర్ణి చిత్ర షూటింగ్ లో బిజీ గా ఉన్న బాలయ్య, అది పూర్తవగానే, ఆదిత్య 999 షూటింగ్ లో పాల్గొంటాడు. స్క్రిప్ట్ ఇప్పటికే పూర్తయ్యిందని, ప్రి ప్రొడక్షన్ వర్క్ తొందరలోనే మొదలవుతుందని దర్శకుడు సింగీతం తెలిపారు.