
కంగనా రనౌత్ నటించి డైరెక్ట్ చేసిన మణికర్ణిక సినిమాపై వివాదాలు కొనసాగుతూనే ఉన్నాయి. క్రిష్ డైరక్షన్ లో మొదలైన ఆ సినిమా అతను మధ్యలో వదిలేయడంతో కంగనా టేకప్ చేసి సినిమా పూర్తి చేసింది. అయితే ఆఫ్టర్ రిలీజ్ క్రిష్ సినిమా తాను చేస్తే బంగారంలా ఉండేదని కామెంట్ చేశాడు. అయితే క్రిష్ కామెంట్స్ పై కంగనా సీరియస్ అయ్యింది. క్రిష్ కు డిసెంబర్ లో సినిమ చూపించాలని ట్రై చేశామని కాని అతను చూడలేదని.
ఇప్పుడు సినిమా అతనికి నచ్చింది కాబట్టి ఈ సినిమా ఆయన చేశాడని చెప్పుకుంటున్నాడని అన్నారు కంగనా రనౌత్. అప్పుడు సినిమాపై నమ్మకం కోల్పోయిన క్రిష్ తాము నాశనం చేశామన్న భావనలో ఉన్నాడని.. అయినా సరే సినిమా నచ్చ బట్టే ఇది నా సినిమా అంటూ కామెంట్స్ చేస్తున్నాడని చెప్పారు కంగనా రనౌత్. ఇక ఈ సినిమా గురించి సోనూ సూద్ కు మాట్లాడే అర్హత లేదని. ఈ సినిమాతో అతనికి ఎలాంటి సంబంధం లేదని అన్నారు కంగానా.