
లాస్ట్ ఇయర్ వరకు వరుస సినిమాలతో ఫుల్ స్వింగ్ లో ఉన్న నాచురల్ స్టార్ నాని ఇప్పుడు కొద్దిగా వెనక్కి తగ్గాడని చెప్పొచ్చు. లాస్ట్ ఇయర్ వచ్చిన కృష్ణార్జున యుద్ధం, దేవదాస్ రెండు నిరాశపరచడంతో నాని ఈసారి పక్కా హిట్ కొట్టాలన్న కసితో జెర్సీ సినిమా చేస్తున్నాడు. గౌతం తిన్ననూరి డైరక్షన్ లో వస్తున్న జెర్సీ సినిమా ఏప్రిల్ లో రిలీజ్ ప్లాన్ చేస్తున్నారు. ఇదిలాఉంటే జెర్సీ తర్వాత నాని విక్రం కుమార్ డైరక్షన్ లో సినిమా చేస్తున్నాడు.
ఆ సినిమా ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుగుతుండగా సినిమాలో ఐదుగురు హీరోయిన్స్ నటిస్తారని తెలుస్తుంది. ఇప్పటికే ఈ ప్రాజెక్ట్ లో కీర్తి సురేష్, మేఘా ఆకాశ్ తో పాటుగా వింక్ బ్యూటీ ప్రియా ప్రకాశ్ కూడా సెలెక్ట్ అయినట్టు తెలుస్తుంది. ఇక వీళ్ల ముగ్గురు కాకుండా మరో ఇద్దరు హీరోయిన్స్ కూడా ఈ సినిమాలో ఉంటారని తెలుస్తుంది. నాని ప్లే బోయ్ గా నటిస్తున్న ఈ సినిమా మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్నారు. ఇంకా టైటిల్ కన్ఫాం చేయని ఈ సినిమాపై వస్తున్న వార్తలు మాత్రం అంచనాలు పెంచేస్తున్నాయి.