
మెగా పవర్ స్టార్ రాం చరణ్, బోయపాటి శ్రీను కాంబినేషన్ లో భారీ అంచనాలతో వచ్చిన సినిమా వినయ విధేయ రామ. కియరా అద్వాని హీరోయిన్ గా నటించిన ఈ సినిమాకు దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందించగా డివివి దానయ్య భారీ బడ్జెట్ తో నిర్మించారు. సంక్రాంతి కానుకగా వచ్చిన ఈ సినిమా మొదటి షోతోనే టాక్ తెలిసిపోయింది. 92 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ తో వచ్చిన వివిఆర్ ఫైనల్ గా 62 కోట్ల దగ్గర కలక్షన్స్ క్లోజ్ అయ్యాయి.
ఇక ఈ సినిమా ఫెయిల్యూర్ గురించి ఏకంగా సినిమా హీరో రాం చరణ్ స్పందించడం విశేషం. సినిమా కోసం ఎంతో కష్టపడినా అభిమానులు, ప్రేక్షకుల అంచనాలను అందుకోలేదని దానికి పూర్తి బాధ్యత తమదే అని.. ఈసారి అలాంటి తప్పులు జరుగకుండా ఎలాంటి శక్తి వంచన లేకుండా మీకు నచ్చే సినిమాతో వస్తామని ఓ లెటర్ ద్వారా తన అభిప్రాయాన్ని వ్యక్తపరిచాడు రాం చరణ్.
తను చేసిన సినిమా ఫ్లాప్ అని ఒప్పుకునేందుకు స్టార్ హీరోలకు గట్స్ ఉండాలి. అలా అభిమానులు, ప్రేక్షకులకు తన తరపున ఓ ప్రకటన ద్వారా తన మంచి మనసు చాటుకున్న వాడు అయ్యాడని చెప్పొచ్చు.