
ఛలో సినిమాతో సత్తా చాటిన వెంకీ కుడుముల డైరక్షన్ లో యువ హీరో నితిన్ సినిమా చేస్తాడని కొన్నాళ్లుగా వినిపిస్తున్న వార్త. ఈ సినిమాకు టైటిల్ గా భీష్మ అని ఫిక్స్ చేశారు. సినిమాలో హీరోయిన్ గా రష్మిక మందన్నను సెలెక్ట్ చేసినట్టు తెలుస్తుంది. ఇంకా సెట్స్ మీదకు వెళ్లని ఈ సినిమా ఆఫర్ కావాలంటే 3 లక్షలు కడితే చాలంటూ ఓ గ్రూప్ వాట్సాప్ మెసేజులు పంపిస్తుందట.
ఆ వాట్సాప్ గ్రూప్ లో యాడ్ అయ్యి వారు చెప్పిన ఎకౌంట్ కు 3 లక్షలు పంపిస్తే నితిన్ సినిమాలో ఆఫర్ ఉంటుందన్నమాట. అయితే ఈ వ్యవహారం చిత్రయూనిట్ కు తెలియకుండా ఓ గ్యాంగ్ చేస్తుందట. విషయం తెలుసుకున్న డైరక్టర్ వెంకీ కుడుముల తమ సినిమా కోసం ఎలాంటి కాస్టింగ్ కాల్ జరుపలేదని మీరు మోసపోవద్దని దర్శకుడు వెంకీ క్లారిటీ ఇచ్చాడు. సినిమా ఛాన్స్ అనగానే ఎంత అడిగితే అంత ఇచ్చే ఈరోజుల్లో ఇలాంటి ఘరానా మోసాలు చాలా జరుగుతాయి. వాటి పట్ల నటీనటులు జాగ్రత్త పడాల్సిన అవసరం ఉంది.