చార్లితో మహేష్ న్యూ స్టెప్..!

సూపర్ స్టార్ మహేష్ మహర్షి సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్నాడు. ఈ సినిమా తర్వాత సుకుమార్ తో సినిమా కోసం సిద్ధమవుతున్నాడు మహేష్. ఇదిలాఉంటే మహేష్ తన ప్రొడక్షన్ లో వెబ్ సీరీస్ మొదలు పెడుతున్నట్టుగా కొన్నాళ్లుగా వార్తలు వస్తున్నాయి. అయితే త్వరలోనే ఆ స్టెప్ వేయనున్నారట. నమ్రత ఇప్పటికే ఆ వెబ్ సీరీస్ కు సంబందించిన కథా చర్చలు పూర్తి చేశారట. మహేష్ ఫైనల్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడమే ఆలస్యం సెట్స్ మీదకు వెళ్తుందట.

మహేష్ స్థాపించిన ఎం.బి ప్రొడక్షన్స్ లో ఈ వెబ్ సీరీస్ రాబోతుంది. సుకుమార్ దగ్గర అసిస్టెంట్ గా పనిచేసిన హుస్సెన్ షా కిరణ్ ఈ వెబ్ సీరీస్ ను డైరెక్ట్ చేస్తాడని తెలుస్తుంది. ఇక ఈ వెబ్ సీరీస్ కు టైటిల్ గా చార్లి అని పెట్టబోతున్నారట. చార్లి వెరైటీగా టైటిల్ ఉంది కదా వెబ్ సీరీస్ కూడా అదేవిధంగా ఉంటుందట. మీకు మీరే మాకు మేమే సినిమా డైరెక్ట్ చేసిన హుస్సేన్ షా కిరణ్ ఈ వెబ్ సీరీస్ తో సక్సెస్ కొట్టాలని చూస్తున్నాడు. మరి మహేష్ వెబ్ సీరీస్ ప్రొడక్షన్ ఏవిధమైన రిజల్ట్ అందుకుంటుందో చూడాలి.