ఆర్.ఆర్.ఆర్ లో ప్రభాస్ కూడానా..!

బాహుబలి తర్వాత రాజమౌళి చేస్తున్న ఆర్.ఆర్.ఆర్ సినిమాలో ఎన్.టి.ఆర్, రాం చరణ్ కలిసి నటిస్తున్నారని తెలిసి సినిమాపై మరింత అంచనాలు పెరిగాయి. పిరియాడికల్ మూవీగా రాబోతున్న ఆర్.ఆర్.ఆర్ సినిమాలో ఎన్.టి.ఆర్, చరణ్ మాత్రమే కాదు యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ గెస్ట్ రోల్ కూడా ఉంటుందని అంటున్నారు. బాహుబలి సినిమాతో ప్రభాస్ ఏ రేంజ్ కు వెళ్లాడన్నది తెలిసిందే.. రాజమౌళితో పాటుగా ప్రభాస్ కూడా బాహుబలి కోసం ఎంతో కష్టపడ్డాడు.

ఆర్.ఆర్.ఆర్ లో కూడా ప్రభాస్ ఉంటే కచ్చితంగా సినిమాకు స్పెషల్ క్రేజ్ వచ్చినట్టే. ఇద్దరు సూపర్ స్టార్స్ ఉంటేనే ఫ్యాన్స్ కు పండుగే అనుకుంటుంటే ఇప్పుడు ప్రభాస్ కూడా ఈ సినిమలో జాయిన్ అవుతుండటం ఆర్.ఆర్.ఆర్ కు మరింత క్రేజ్ తీసుకొస్తుంది. డివివి దానయ్య నిర్మిస్తున్న ట్రిపుల్ ఆర్ మూవీ 300 కోట్ల భారీ బడ్జెట్ తో తెరకెక్కుతుంది. మొదటి షెడ్యూల్ పూర్తి చేసుకున్న ఈ సినిమా ప్రస్తుతం సెకండ్ షెడ్యూల్ షూటింగ్ జరుపుకుంటుంది.