మహేష్ తో నేనా.. నో ఛాన్స్..!

మహర్షి సినిమా తర్వాత మహేష్ చేస్తున్న సుకుమార్ సినిమాలో హీరోయిన్ గా బాలీవుడ్ భామ కత్రినా కైఫ్ ను తీసుకుంటున్నట్టు వార్తలు వచ్చాయి. సుకుమార్ అండ్ టీం ఆల్రెడీ కత్రినాతో చర్చలు జరిపారని మహేష్ తో నటించేందుకు కత్రినా ఓకే చెప్పిందని రకరకాల వార్తలు రాశారు. అయితే ఇదే విషయాన్ని కత్రినాను అడిగితే మాత్రం నేనా మహేష్ తోనా నో ఛాన్స్ అనేసింది. అసలు ఇంతవరకు తెలుగు సినిమాకు సంబందించి ఎలాంటి ఆఫర్స్ తన దగ్గరకు రాలేదని చెప్పుకొచ్చింది కత్రినా కైఫ్.

ప్రస్తుతం సల్మాన్ ఖాన్ భారత్ సినిమాలో నటిస్తున్న కత్రినా కైఫ్ తాను ఇంకా ఏ సినిమాకు ఓకే చెప్పలేదని.. కొన్నాళ్లుగా మీడియాలో వస్తున్నాట్టుగా తెలుగు సినిమాలో తాను నటించడం లేదని. దానికి సంబందించి ఎవరు తనని సంప్రదించలేదని అన్నది కత్రినా కైఫ్. సో మహేష్ తో కైత్రినా జోడీ అన్నది ఒట్టి రూమర్ అన్నమాట. ప్రస్తుతం బౌండెడ్ స్క్రిప్ట్ పూర్తి చేసే పనిలో ఉన్న సుకుమార్ త్వరలోనే సినిమాకు సంబందించిన మిగతా కాస్ట్ డీటైల్స్ వెళ్లడిస్తారని తెలుస్తుంది.