
డిస్ట్రిబ్యూటర్ కం ప్రొడ్యూసర్ దిల్ రాజుకి 2019 బాగా కలిసి వచ్చేలా ఉంది. ఆయన నిర్మాణంలో వచ్చిన ఎఫ్-2 ఊహించిన దాని కన్నా ఎక్కువ వసూళ్లు రాబట్టింది. ఇక మరో పక్క ఈ లాభాలను రాం చరణ్ వినయ విధేయ రామ నష్టాలు కవర్ చేశాయని చెప్పొచ్చు. ప్రస్తుతం మహేష్ మహర్షి సినిమా నిర్మాణంలో భాగమైన దిల్ రాజు ఆ సినిమాతో పాటుగా 96 తెలుగు రీమేక్ సినిమాను చేస్తున్నాడు.
ఈ రెండు సినిమాలతో పాటుగానే యువ హీరో రాజ్ తరుణ్ తో నీది నాది ఒకటే లోకం సినిమా ఫిక్స్ చేశాడు. ఇదే క్రమంలో అక్కినేని వారసుడు నాగ చైతన్య సినిమా కూడా లైన్ చేస్తున్నాడట. తన ప్రొడక్షన్ లో పదేళ్లుగా పనిచేస్తున్న శషి డైరక్షన్ లో చైతు సినిమా ప్లాన్ చేస్తున్నాడట దిల్ రాజు. ఈ సినిమా చైతు కెరియర్ కు చాలా ఇంపార్టెంట్ అని చెప్పొచ్చు. చైతు మొదటి సినిమా జోష్ దిల్ రాజు నిర్మాణంలోనే వచ్చింది. అప్పుడు మంచి ఫాం లో ఉన్న దిల్ రాజు జోష్ తో చైతుకి హిట్ ఇస్తాడని అనుకుంటే మొదటి సినిమానే నిరాశపరచేలా చేశాడు. మరి ఈసారైనా చైతుకి దిల్ రాజు హిట్ ఇస్తాడా లేదా అన్నది చూడలి.