డైరక్టర్ రొమాన్స్.. అనసూయ ఏమందంటే..!

యాంకర్ గా బుల్లితెరను ఏలేస్తున్న అనసూయ సిల్వర్ స్క్రీన్ పై కూడా తన సత్తా చాటుతుంది. రంగస్థలం రంగమ్మత్తగా అదరగొట్టిన అనసూయ ఇప్పుడు వరుస సినిమాల్లో నటిస్తుంది. ఈమధ్యనే వచ్చి సూపర్ హిట్ అయిన ఎఫ్-2లో కూడా చివర్లో తళుక్కున మెరిసింది అనసూయ. ఇక రీసెంట్ గా డైరక్టర్ తరుణ్ భస్కర్ హీరోగా చేస్తున్న సినిమాలో అనసూయ హీరోయిన్ గా నటిస్తుందని ఆ సినిమాలో అనుష్క తరుణ్ తో రొమాన్స్ కూడా చేస్తుందని వార్తలు వచ్చాయి.

అయితే ఈ వార్తలపై స్పందించింది అనసూయ. తాను తరుణ్ భాస్కర్ నటిస్తున్న సినిమాలో చేస్తున్న విషయం నిజమే కాని వార్తల్లో వస్తున్నట్టుగా గ్లామర్ షో కాదని తన కెరియర్ కు ఆ సినిమా ఎంతో సపోర్ట్ గా నిలుస్తుందని చెప్పుకొచ్చింది అనసూయ. ఈ సినిమాను విజయ్ దేవరకొండ నిర్మిస్తుండగా నూతన దర్శకుడు డైరెక్ట్ చేస్తాడట. మరి ఇన్నాళ్లకు లీడ్ రోల్ పోశిస్తున్న అనసూయ ఈ సినిమాతో ఎలాంటి ఫలితాన్ని అందుకుంటుందో చూడాలి.