సతీష్ వేగేశ్న.. ఆల్ ఈజ్ వెల్..!

శతమానం భవతి, శ్రీనివాస కళ్యాణం లాంటి కుటుంబకథా చిత్రాల దర్శకుడిగా మంచి పేరు తెచ్చుకున్న సతీష్ వేగేశ్న మొదటి సినిమా హిట్ కొట్టినా రెండో సినిమా మాత్రం ఆశించిన ఫలితాన్ని అందుకోలేదు. ఇక ప్రస్తుతం దర్శకుడు సతీష్ వేగేశ్న తన 3వ సినిమా ప్రయత్నాల్లో ఉన్నాడని తెలుస్తుంది. ఇప్పటికే స్క్రిప్ట్ పూర్తి కాగా సినిమాను త్వరలో సెట్స్ మీదకు తీసుకెళ్తాడని తెలుస్తుంది.

ఈ సినిమాకు టైటిల్ గా ఆల్ ఈజ్ వెల్ అని ఫిక్స్ చేశారట. అంతా కొత్త వాళ్లతో ఈ సినిమా ఉంటుందని తెలుస్తుంది. శతమానం భవతి సినిమాతో నేషనల్ అవార్డ్ సైతం అందుకున్న సతీష్ వేగేశ్న త్వరలో చేయబోతున్న ఆల్ ఈజ్ వెల్ సినిమాతో కూడా మరోసారి ప్రేక్షకులను మెప్పించాలని చూస్తున్నాడు. ఈ సినిమా నిర్మాత మిగతా కాస్ట్ అండ్ క్రూ గురించి డీటైల్స్ తెలియాల్సి ఉంది.