వెంకీ 75వ సినిమా అదేనా..!

ఎఫ్-2 సినిమాతో విక్టరీ వెంకటేష్ ఫాంలోకి వచ్చేసినట్టే అని చెప్పొచ్చు. అనీల్ రావిపుడి డైరక్షన్ లో వచ్చిన ఈ సినిమాను దిల్ రాజు నిర్మించారు. వెంకటేష్ తో పాటుగా మెగా హీరో వరుణ్ తేజ్ కూడా ఈ సినిమాలో నటించారు. ఇక ఈ సినిమా తర్వాత వెంకటేష్ వెంకీమామ సినిమా చేస్తున్నాడు. ఆ సినిమాలో కూడా వెంకటేష్ తో పాటుగా మేనళ్లుడు నాగ చైతన్య నటిస్తున్నాడని తెలిసిందే.   

జై లవ కుశ తర్వాత బాబి డైరెక్ట్ చేస్తున్న సినిమా కాబట్టి ఆ సినిమా మీద కూడా అంచనాలున్నాయి. ఇక ఎఫ్-2 వెంకటేష్ కెరియర్ లో 73వ సినిమా కాగా.. వెంకీ మామ 74వది అవుతుంది. ఇక 75వ సినిమా సంథింగ్ స్పెషల్ గా ఉండేలా ప్లాన్ చేస్తున్నాడట వెంకటేష్. అందుకే త్రివిక్రం డైరక్షన్ లో మూవీ ప్లాన్ చేస్తున్నాడట. కొన్నాళ్లుగా త్రివిక్రం తో వెంకటేష్ మూవీ ఉంటుందని వార్తలు వస్తున్నాయి తప్ప సెట్స్ మీదకు వెళ్లింది లేదు. త్రివిక్రం తో తన ల్యాండ్ మార్క్ మూవీ చేయాలన్నది వెంకటేష్ ఆలోచన అట. 

అంతేకాదు ఈ సినిమా బడ్జెట్ విషయంలో కూడా ఏమాత్రం రాజీ పడకుండా భారీ స్కేల్ లోనే తీయాలని చెప్పడట. మరి త్రివిక్రం ప్రస్తుతం బన్ని సినిమా చేస్తున్నాడు. ఆ సినిమా తర్వాత చిరు సినిమా లైన్ లో ఉంది. దాని తర్వాత వెంకటేష్ సినిమా ఉండొచ్చని అంటున్నారు. మరి వెంకీ 75వ సినిమా ఎలాంటి సినిమా అవుతుందో చూడాలి.