
దివంగత నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి బయోపిక్ గా వస్తున్న సినిమా యాత్ర. ముఖ్యంగా ఆయన పాదయాత్ర నేపథ్యంతో వస్తున్న ఈ సినిమా ఫిబ్రవరి 8న రిలీజ్ కాబోతుంది. మహి వి రాఘవ్ డైరక్షన్ లో వస్తున్న ఈ సినిమాను 70 ఎం.ఎం ఎంటర్టైన్మెంట్స్ లో విజయ్ చిల్లా, శషి దేవిరెడ్డి నిర్మిస్తున్నారు. కృష్ణ కుమార్ మ్యూజిక్ అందించిన ఈ సినిమాలోని ఇప్పటివరకు రిలీజైన అన్ని సాంగ్స్ అద్భుతంగా ఉన్నాయి.
ఇక ఈరోజు రిలీజైన మరుగైనావ రాజన్నా.. కనుమరుగైనావ రాజన్నా సాంగ్ మాత్రం మరోసారి రాజన్న ఈ లోకాన్ని వదిలి వెళ్లిన రోజు గుర్తు చేస్తుంది. సినిమాలో క్లైమాక్స్ లో వై.ఎస్ మరణించిన సన్నివేశాలను రియల్ ఫుటేజ్ వాడుతున్నట్టుగా తెలుస్తుంది. ఆ టైంలో ఈ సాంగ్ వస్తుందని చెప్పొచ్చు. పెంచల్ దాస్ రాసి, పాడిన ఈ సాంగ్ ఎంత అద్భుతంగా ఉంది అన్నది మాటల్లో చెప్పలేం. నువ్వొచ్చే దావల్లో.. పున్నగ పూలుజల్లి.. నీకోసం వేచుంటే.. చేజారీ పోతీవా.. మా గుండెల్లో గుడిసెల్లో కొలు ఉంటావు రాజన్నా.. సాయం సంధ్యం దీపంల్లో నిన్నే తలచుకుంటాము.. అంటూ వైఎస్ అభిమానుల హృదయాలను బరువెక్కించేలా ఈ పాట ఉంది. యాత్ర సినిమాలో వైఎస్ఆర్ పాత్రలో మళయాళ స్టార్ హీరో మమ్ముట్టి నటించారు. ఫిబ్రవరి 8న తెలుగు, తమిళ, మళయాళ భాషల్లో యాత్ర రిలీజ్ అవుతుంది.