
ఎన్.టి.ఆర్ కథానాయకుడు సినిమా నిరాశపరచడంతో ఎన్.టి.ఆర్ మహానాయకుడు సినిమాకు రిపేర్లు చేస్తున్నారు క్రిష్ అండ్ టీం. ఎన్.టి.ఆర్ బయోపిక్ అసలైతే ఒక పార్ట్ గా చేయాలని అనుకున్నా మధ్యలో లెంగ్త్ ఎక్కువవడం వల్ల రెండు పార్టులుగా మార్చాల్సి వచ్చింది. ఎన్.టి.ఆర్ కథానాయకుడులో ఎమోషనల్ కంటెంట్ మిస్ అవడం వల్ల సినిమా ప్రేక్షకులకు నచ్చలేదు.
రెండు పార్టులకు కలిపి ఒకే ట్రైలర్ వదిలిన దర్శక నిర్మాతలు. ఎన్.టి.ఆర్ మహానాయకుడు కోసం కొన్ని సీన్స్ రీషూట్ చేస్తున్నారట. అంతేకాదు ఈ సినిమా కచ్చితంగా ప్రేక్షకుల మెప్పు పొందేలా ఎమోషనల్ కంటెంట్ ఉండేలా జాగ్రత్త పడుతున్నారట. సినిమా రిలీజ్ ఫిబ్రవరి 7న అనుకున్నా అది కాస్త 14కి చేరింది. ఇప్పుడు ఆ డేట్ న కూడా రావడం కష్టమే అంటున్నారు. అఫిషియల్ గా ఎన్.టి.ఆర్ మహానాయకుడు రిలీజ్ ఎప్పుడు అన్నది తెలియాల్సి ఉంది. మరి ఈ రెండో పార్ట్ అయినా సరే ప్రేక్షకులను మెప్పిస్తుందో లేదో చూడాలి.