
ఉయ్యాలవాడ నరసింహా రెడ్డి బయోపిక్ గా వస్తున్న సైరా నరసింహా రెడ్డి సినిమాను ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నారు. చిరంజీవి 151వ సినిమాగా వస్తున్న సైరా సినిమాను కొణిదెల ప్రొడక్షన్స్ బ్యానర్ లో దాదాపు 250 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిస్తున్నారట. సురేందర్ రెడ్డి డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమా మేజర్ పార్ట్ షూటింగ్ దాదాపు పూర్తి అయ్యిందట. అయితే ఇంకాస్త బడ్జెట్ ఇస్తే బాగుంటుందని డైరక్టర్ సూరి వ్యక్తపరచగా ఇప్పటికి పెట్టింది చాలు ఉన్న వాటితోనే మిగతా సినిమా పూర్తి చేయాలని గట్టి వార్నింగ్ ఇచ్చాడట చరణ్.
సైరా సినిమా మొదటి నుండి యూనిట్ లో ఏదో ఒక అసంతృప్తి కనిపిస్తూనే ఉంది. మరి ఈ ఎఫెక్ట్ సినిమా మీద పడకుండా చూసుకుంటే బెటర్. ఇక సైరా సినిమాను ముందు సమ్మర్ రిలీజ్ అనుకున్నా అది కాస్త దసరాకి వాయిదా పడింది. 2019 దసరాకి సైరా నరసిం హా రెడ్డితో చిరు వస్తున్నాడు. అమితాబ్, జగపతి బాబు, సుదీప్, విజయ్ సేతుపతి వంటి స్టార్స్ ఈ సినిమాలో నటించగా నయనతార ఫీమేల్ లీడ్ గా చేసింది. మరి భారీ అంచనాలతో వస్తున్న సైరా ఆ అంచనాలను అందుకునే సినిమా అవుతుందా లేదా అన్నది చూడాలి.