
ఎన్.టి.ఆర్ బయోపిక్ సినిమా ముందు దర్శకుడిగా తేజ పేరు వినిపించింది.. వినిపించడమే కాదు తేజ డైరక్షన్ లోనే సినిమాకు కొబ్బరికాయ కొట్టారు. అయితే ఆ సినిమా నుండి తేజ అర్ధాంతరంగా బయటకు వచ్చాడు. తేజ ఎక్సిట్ కు కారణాలు ఏంటన్నది ఎవరికి పర్ఫెక్ట్ రీజన్ తెలియదు. స్క్రిప్ట్ పరమైన గొడవల వల్లే తేజ ఈ ఒత్తిడి నాకెందుకు అనుకుని బయటకు వచ్చాడని అన్నారు.
క్రిష్ డైరక్షన్ లో వచ్చిన ఎన్.టి.ఆర్ బయోపిక్ మొదటి పార్ట్ కథానాయకుడు డిజాస్టర్ అయ్యింది. సినిమా టాక్ బాగున్నా సరే వసూళ్లు మాత్రం రాలేదు. అయితే ఈ సినిమాపై తేజ స్పందన ఎలా ఉంటుందా అని మీడియా ఎదురుచూస్తుండగా బెల్లంకొండ శ్రీనివాస్ సీత సినిమా ప్రమోషనల్ ఈవెంట్ లో తేజ ఎన్.టి.ఆర్ బయోపిక్ పై స్పందించాడు. తాను ఇంకా సినిమా చూడలేదని అందుకే ఏం మాట్లాడలేనని అన్నారు. అయితే సినిమాలో డ్రామా మిస్సయిందన్న కామెంట్ మీద రెస్పాండ్ అవుతూ అది దర్శకుడి టాలెంట్ ను బట్టి ఉంటుందని చెప్పాడు. సినిమా చూడలేదని చెప్పడంతో తప్పించుకున్నాడు తేజ.