యాత్ర సాంగ్.. మనసుని కదిలించేస్తుంది..!

వైఎస్స్ రాజశేఖర్ రెడ్డి బయోపిక్ గా మహి వి రాఘవ్ డైరక్షన్ లో 70 ఎం.ఎం ఎంటర్టైన్మెంట్స్ లో వస్తున్న సినిమా యాత్ర. వై.ఎస్ పాదయాత్ర నేపథ్యంతో వస్తున్న సినిమా కాబట్టి ఈ సినిమాకు యాత్ర అని టైటిల్ ఫిక్స్ చేశారు. ఫిబ్రవరి 8న తెలుగు, తమిళ, మళయాళ భాషల్లో రిలీజ్ అవుతున్న ఈ సినిమా నుండి వచ్చిన టీజర్, ట్రైలర్స్ ఇప్పటికే ప్రేక్షకాదరణ పొందాయి. ముఖ్యంగా వైఎస్ అభిమానులకు ఈ సినిమా గొప్ప కానుక కానుంది.

రీసెంట్ గా న్యూ జెర్సీలో యాత్ర స్పెషల్ ఈవెంట్ జరుపగా ఫిబ్రవరి 1 న హైదరాబాద్ ఎన్.కన్వెషన్ లో ప్రీ రిలీజ్ ఈవెంట్ ప్లాన్ చేశారు. లేటెస్ట్ గా ఈ సినిమా నుండి మరో సాంగ్ రిలీజ్ చేశారు దర్శక నిర్మాతలు. పల్లెల్లో కల ఉంది.. పంటల్లో కలిముంది అంటూ రైతు కష్టాన్ని చెప్పే పాటగా ఇది వచ్చింది. సిరివెన్నెల సీతారామశాస్త్రి రచించిన ఈ పాటను ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడటం జరిగింది. ఈ సినిమాకు కే (కృష్ణ కుమార్) మ్యూజిక్ అందిస్తున్నారు. వైఎస్ పాత్రలో మళయాళ స్టార్ హీరో మమ్ముట్టి నటించారు. ఈ సినిమాకు మమ్ముట్టి సొంత డబ్బింగ్ చెప్పడం విశేషం. విజయ్ చిల్లా, శషి దేవి రెడ్డి యాత్ర మూవీని ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా తెరకెక్కించారు.