దిల్ రాజుకి దేవరకొండ షాక్..!

యువ సంచలనం విజయ్ దేవరకొండ టాలీవుడ్ క్రేజీ ప్రొడ్యూసర్ దిల్ రాజుకి పెద్ద షాక్ ఇచ్చాడట. లాస్ట్ ఇయర్ టాక్సీవాలా సినిమాతో మళ్లీ తన స్టామినా ఏంటో ప్రూవ్ చేసుకున్న విజయ్ దేవరకొండ ప్రస్తుతం డియర్ కామ్రేడ్ సినిమా చేస్తున్నాడు. ఆ సినిమా తర్వాత మళ్ళీ మళ్లీ ఇది రాని రోజు డైరక్టర్ క్రాంతి కుమార్ తో సినిమా ఉంటుందని తెలిసిందే. అయితే ఇటీవల దిల్ రాజు విజయ్ దేవరకొండతో సినిమా ప్లాన్ చేశాడట.

అయితే విజయ్ దేవరకొండ తనకు 10 కోట్లు రెమ్యునరేషన్ కావాలని డిమాండ్ చేశాడట. ఈమధ్య మీడియం బడ్జెట్ సినిమాలే తనకు లాభాలు తెస్తున్నాయని గుర్తించిన దిల్ రాజు అలాంటి సినిమాలనే చేసేందుకు ఫిక్స్ అయ్యాడు. అందుకే విజయ్, నాని, శర్వానంద్ లాంటి హీరోలతో వరుస సినిమాలు ప్లాన్ చేస్తున్నాడు. అయితే విజయ్ అడిగిన మొత్తాన్ని ఇచ్చేందుకు దిల్ రాజు ఒప్పుకున్నాడా లేదా అన్నది తెలియాల్సి ఉంది.