ఆర్.ఆర్.ఆర్ లో బాలీవుడ్ భామ..!

రాజమౌళి తెరకెక్కిస్తున్న మెగా నందమూరి మల్టీస్టారర్ మూవీ ఆర్.ఆర్.ఆర్ మూవీ ఫస్ట్ షెడ్యూల్ పూర్తి చేసుకుని సెకండ్ షెడ్యూల్ ను ఈమధ్యనే మొదలుపెట్టారు. డివివి దానయ్య నిర్మిస్తున్న ఈ సినిమా 300 కోట్ల భారీ బడ్జెట్ తో తెరకెక్కిస్తున్నాడు రాజమౌళి. పిరియాడికల్ మూవీగా రాబోతున్న ఈ మూవీలో హీరోయిన్స్ ఎవరన్నది ఇంకా తెలియలేదు. ఇద్దరు హీరోయిన్స్ నటించే అవకాశం ఉన్న ఈ సినిమాలో ఒక హీరోయిన్ గా బాలీవుడ్ భామ సెలెక్ట్ అయ్యిందని అంటున్నారు.

ఇంతకీ ఎవరా హీరోయిన్ అంటే పరిణితి చోప్రా అని తెలుస్తుంది. బాలీవుడ్ లో క్రేజీ హీరోయిన్ అయిన పరిణితి చోప్రా ఈమధ్య అక్కడ సినిమాలను తగ్గించింది. సరైన ఛాన్స్ కోసం ఎదురుచూస్తున్న అమ్మడికి రాజమౌళి ఆఫర్ వచ్చిందట. ట్రిపుల్ ఆర్ ఛాన్స్ అనగానే పరిణితి కూడా ఎక్సైట్ అయ్యిందని తెలుస్తుంది. ఇప్పటికే డివివి దానయ్య టీం పరిణితితో సంప్రదింపులు జరిపారట. సినిమాకు తగిన కాస్టింగ్ సెలెక్ట్ చేసుకోవడంలో రాజమౌళి పర్ఫెక్ట్ గా ఉంటాడు. పిరియాడికల్ మూవీ కాబట్టి పరిణితి అయితే అందుకు సూటవుతుందని ఆమెను ఎంపిక చేశారని తెలుస్తుంది. మరి ఈ వార్తల్లో ఎంతవరకు నిజం ఉంది అన్నది చిత్రయూనిట్ స్పందిస్తేనే తెలుస్తుంది.