
యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్, మాటల మాంత్రికుడు త్రివిక్రం కాంబినేషన్ లో వచ్చిన సినిమ అరవింద సమేత. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్ లో ఎస్. రాధాకృష్ణ ఈ సినిమా నిర్మించారు. ఎన్.టి.ఆర్ సరసన పూజా హెగ్దె హీరోయిన్ గా నటించగా తమన్ ఈ సినిమాకు మ్యూజిక్ అందించారు. 2018 దసరా కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర హిట్ గా నిలిచింది.
ఎన్.టి.ఆర్ సిక్స్ ప్యాక్ తో వచ్చిన ఈ సినిమా నందమూరి అభిమానులకు బాగా నచ్చింది. అయితే ఎక్కడో త్రివిక్రం మార్క్ మిస్సైదన్న వాదన వినిపించింది. అయితే ఈ సినిమా స్మాల్ స్క్రీన్ పై మాత్రం నెగటివ్ రిజల్ట్ అందుకుంది. సంక్రాంతి కానుకగా జీ తెలుగులో టెలికాస్ట్ అయిన అరవింద సమేత సినిమా కేవలం 13.7 టి.ఆర్.పి రేటింగ్ తెచ్చుకుంది. ఎన్.టి.ఆర్ సినిమాలు టి.ఆర్.పి రేటింగులలో కూడా రికార్డులు సృష్టించాయి అలాంటిది అరవింద సమేతకు ఇంత తక్కువ టి.ఆర్.పి రేటింగ్ రావడం ఆశ్చర్యపరుస్తుంది. బుల్లితెర మీద అరవింద రేటింగ్ చూస్తే నిరాశపరచిందని చెప్పొచ్చు.