'లవర్స్ డే'కు బన్ని బెస్ట్ విష్

మళయాళంలో చిన్న సినిమాగా వస్తున్న ఒరు ఆధార్ లవ్ సినిమా టీజర్ తో ఎంతటి సెన్సేషన్ క్రియేట్ చేసిందో తెలిసిందే. ఆ సినిమా టీజర్ కు సోషల్ మీడియాలో దుమ్ముదులిపేసింది. యూట్యూబ్, ఫేస్ బుక్, వాట్సాఫ్ ఇలా అన్ని ఫ్లాట్ ఫాంలలో వింక్ బ్యూటీ కనుసైగలు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. ఆ సినిమాకు వచ్చిన క్రేజ్ తో ఒరు ఆధార్ లవ్ సినిమాను తెలుగులో లవర్స్ డే టైటిల్ తో రిలీజ్ చేస్తున్నారు. 

ఈ సినిమా ఆడియోకి స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ స్పెషల్ గెస్ట్ గా అటెండ్ అవడం విశేషం. తన సినిమాలు కేరళ, కర్ణాటకలో ఆదరిస్తున్నారు అందుకే ఈ ఆడియోకి వచ్చానని చెప్పాడు బన్ని. తాను సౌత్ ఇండియన్ స్టార్ ను అంటూ చెప్పుకొచ్చిన బన్ని ఈమధ్య సెన్సేషన్ గా మారిన ఒరు ఆధార్ లవ్ టీజర్ తనకు నచ్చిందని. ఆ సినిమా తెలుగులో రావడం మంచి విషయమని సినిమా తప్పకుండా సక్సెస్ అవ్వాలని అవుతుందని ఆశాభావం వ్యక్తపరిచారు. యువ టాలెంట్ వచ్చి ఇంకా మంచి సినిమాలు రావాలని అన్నారు బన్ని. అభిమానులను వదులుకోవడం తనకు ఇష్టం లేదని.. తన అభిమాని నిర్మిస్తున్న ఈ సినిమా మంచి విజయాన్ని అందుకోవాలని అన్నారు.