
దివంగత నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి బయోపిక్ గా వస్తున్న సినిమా యాత్ర. మహి వి రాఘవ్ డైరక్షన్ లో వస్తున్న ఈ సినిమాలో వైఎస్సార్ పాత్రలో మళయాళ మెగాస్టార్ మమ్ముట్టి నటిస్తున్నారు. ఇప్పటికే రిలీజ్ అయిన ప్రచార చిత్రాలు సినిమాపై అంచనాలు పెంచాయి. బయోపిక్ సినిమాల హవా కొనసాగిస్తున్న ఈ టైంలో వైఎస్ జీవిత కథతో వస్తున్న ఈ సినిమా వై.ఎస్ అభిమానుల మనసులు గెలిచేలా సినిమాను తెరకెక్కించారని తెలుస్తుంది.
ఫిబ్రవరి 8న రిలీజ్ కాబోతున్న ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ఈ నెల 26న న్యూజెర్సీలో జరుపనున్నారు. వైఎస్సార్ ఫౌండేషన్, యూఎస్ వైసిపి ఫాలోవర్స్ ఆధ్వర్యంలో యాత్ర ప్రీ రిలీజ్ ఈవెంట్ జరుగనుంది. ఈవెంట్ లో చిత్రయూనిట్ తో పాటుగా మమ్ముట్టి ఇతర స్టార్స్ పాల్గొంటారని సమాచారం. యాత్ర ట్రైలర్ కు మంచి స్పందన రాగా సినిమా కూడా వైఎస్ అభిమానులనే కాదు ప్రేక్షకులను మెప్పించేలా ఉంటుందని తెలుస్తుంది. 70 ఎం.ఎం ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లో శివ మేక సమర్పణలో వస్తున్న యాత్ర సినిమాను విజయ్ చిల్లా, శషి దేవిరెడ్డి నిర్మించారు. ఫిబ్రవరి 8న రిలీజ్ ప్లాన్ చేసిన యాత్ర సినిమా ఓరోజు ముందే అనగా ఫిబ్రవరి 7న యూఎస్ లో ప్రీమియర్స్ పడనున్నాయి.