
సిని పరిశ్రమలో దశాబ్ధం కాలం పైగా స్టార్ హీరోయిన్ గా క్రేజ్ తెచ్చుకున్న కాజల్ అగర్వాల్ రెండు, మూడేళ్ల క్రితం పెట్టా బేడా సర్ధేయడమే అన్న విధంగా కెరియర్ అయోమయంలో ఉండేది. ఎప్పుడైతే మెగాస్టార్ చిరంజీవితో ఖైది నంబర్ 150 చేసిందో అమ్మడి దశ తిరిగింది. ఆ తర్వాత రానా నేనే రాజు నేనే మంత్రి సినిమా కాజల్ ను మళ్లీ బౌన్స్ బ్యాక్ అయ్యేలా చేసింది. కొత్త హీరోయిన్స్ ఎవరు పెద్దగా ఆకట్టుకోకపోవడంతో పాటుగా సమంత కూడా అక్కినేని కోడలుగా మారడం కాజల్ కు బాగా కలిసి వచ్చింది. అందుకే ఇప్పటికి చేతినిండా సినిమాలతో అదరగొడుతుంది.
ప్రస్తుతం బాలీవుడ్ క్వీన్ రీమేక్ లో నటిస్తున్న కాజల్ ఆ సినిమా ప్రమోషన్స్ లో తన పెళ్లి గురించి మనసులోని మాట చెప్పింది. పెళ్లికి ఇంకా కొద్ది రోజుకు టైం ఉందని చెప్పిన కాజల్ ఇండస్ట్రీలో వ్యక్తిని మాత్రం పెళ్లి చేసుకోనని చెప్పింది. హీరోయిన్స్ ఇలాంటి కామెంట్స్ చేస్తే తప్పు పట్టరు కాని ఒకవేళ ఎవరైనా హీరో ఇలాంటి కామెంట్ చేస్తే మాత్రం హీరోయిన్స్ పెళ్లి చేసుకునేందుకు పనికిరారా.. అసలు ఆ ఆలోచన ఎందుకు వస్తుంది.. మీరు పరిశ్రమలోనే ఉంటున్నారు కదా అంటూ రకరకాల ప్రశ్నలతో టార్గెట్ చేస్తారు. కాజల్ ఏ ఉద్దేశంతో అన్నదో కాని ఇది మాత్రం ఆలోచించాల్సిన విషయమే.