బన్ని ఛాన్స్ అలా మిస్సైందా..!

మళయాళ సినిమా ఒరు అడార్ లవ్ సినిమాలోని ఓ చిన్న టీజర్ తో సెన్సేషనల్ సృష్టించింది ప్రియా వారియర్ ప్రకాశ్. కన్నుగీటిన ఈ పిల్ల ఓవర్ నైట్ స్టార్ గా అవతరించింది. ఇక ఆమెకు వచ్చిన క్రేజ్ తో సినిమాను తెలుగులో కూడా రిలీజ్ చేస్తున్నారు. ఒరు అడార్ లవ్ సినిమా తెలుగులో లవర్స్ డే గా రిలీజ్ అవుతుంది. ఫిబ్రవరి 14న ఈ సినిమా రిలీజ్ ప్లాన్ చేశారు. ఈ నెల 23న లవర్స్ డే ఆడియో జరుగనుంది. ఈ ఆడియోకి గెస్ట్ గా స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ వస్తున్నాడని తెలుస్తుంది.

ఇక ఈ ఆడియో ఈవెంట్ కు ముందే చేరుకున్న ప్రియా ప్రకాశ్ తెలుగు మీడియాతో ముచ్చటించింది. ఒక్క టీజర్ తో సంచలనం సృష్టించిన ఈ అమ్మడు తెలుగులో అల్లు అర్జున్ తో నటించే ఛాన్స్ వచ్చినా మిస్ చేసుకుందట. ఆ విషయం ఆమె కూడా ఒప్పుకుంది. అయితే బన్ని సినిమా టైం లో ఒరు అడార్ లవ్ సినిమా కు డేట్స్ ఇవ్వాల్సి వచ్చిందని అందుకే బన్ని సినిమా మిస్సయా అంటుంది. అది మిస్సైంది సరే ఇక మీదట తెలుగులో నటిస్తుందో లేదో చూడాలి.