షాలిని పాండేకి బాలీవుడ్ ఛాన్స్

అర్జున్ రెడ్డి సినిమాలో విజయ్ దేవరకొండ సరసన నటించిన షాలిని పాండే ఆ సినిమాతో యూత్ ఆడియెన్స్ ను ఆకట్టుకుంది. అయితే ఆ తర్వాత అమ్మడి సినిమాల సెలక్షన్ సరిగా లేక కెరియర్ కాస్త సందిగ్ధంలో పడింది. ప్రస్తుతం తమిళ 100 లవ్ రీమేక్ లో నటిస్తున్న షాలిని పాండే ఈమధ్య వచ్చిన బయోపిక్ సినిమాలు మహానటి, ఎన్.టి.ఆర్ కథానాయకుడ్ సినిమాల్లో నటించింది. అయితే అవి కెరియర్ కొనసాగించేందుకు ఏమాత్రం ఉపయోగపడలేదు.

తెలుగులో కళ్యాణ్ రాం హీరోగా వస్తున్న 118 సినిమా చేస్తున్న షాలిని పాండేకి లక్కీగా ఓ బాలీవుడ్ క్రేజీ ఆఫర్ వచ్చింది. బాలీవుడ్ నటుడు పరేష్ రావల్ తనయుడు ఆదిత్య హీరోగా అనురాగ్ కశ్యప్ సమర్పణలో బాంఫాడ్ సినిమా వస్తుంది. ఆ సినిమాలో హీరోయిన్ గా షాలిని పాండేని ఎంపిక చేసినట్టు తెలుస్తుంది. అనురాగ్ కశ్యప్ సినిమాలంటే బీ టౌన్ లో మంచి గిరాకి ఉంటుంది. మరి అలాంటి దర్శక నిర్మాత చేతుల్లో పడిన షాలిని పాండే బాలీవుడ్ లో అదరగొడుతుందని చెప్పొచ్చు.