రౌడీ బేబీ రికార్డులు ఆగట్లేదు

ధనుష్, సాయి పల్లవి జంటగా నటించిన మారి-2 సినిమా 2018 డిసెంబర్ 21న తెలుగు, తమిళ భాషల్లో రిలీజైంది. తెలుగులో పెద్దగా ప్రభావితం చూపించిన ఆ సినిమా తమిళంలో యావరేజ్ గా ఆడింది. అయితే ఆ సినిమాలో సాంగ్ మాత్రం సంచలనాలు సృష్టిస్తుంది. రౌడీ బేబీ అంటూ వచ్చే ఈ సాంగ్ లో ధనుష్, సాయి పల్లవి ఇద్దరు అదరగొట్టారు. ముఖ్యంగా సాయి పల్లవి మరోసారి తన మ్యాజిక్ తో సాంగ్ సక్సెస్ అయ్యేలా చేసింది.

ఈ సాంగ్ అఫిషియల్ వీడియో యూట్యూబ్ లో సెన్సేషన్స్ క్రియేట్ చేస్తుంది. రిలీజ్ చేసిన రెండు వారాల్లోనే రౌడీ బేబీ సాంగ్ 100 మిలియన్ వ్యూస్ సాధించి సరికొత్త రికార్డ్ సృష్టించింది. యువన్ శంకర్ రాజా మ్యూజిక్ అందించిన ఈ రౌడీ బేబీ సాంగ్ యూట్యూబ్ ను షేక్ చేస్తుందంటే నమ్మాల్సిందే. అంతేకాదు వాట్సాప్ స్టేటస్ లో కూడా ఈ సాంగ్ హల్ చల్ చేస్తుండటం విశేషం. మొన్నటివరకు ఫిదా సినిమాలోని వచ్చిండే మెల్లా మెల్లగ వచ్చిండే సాంగ్ అత్యధిక వ్యూస్ కలిగిన సౌత్ సాంగ్ గా ఉంది. ఇప్పుడు రౌడీ బేబీ దాని కూడా దాటేసింది. విశేషం ఏంటంటే ఫిదా పాట కూడా సాయి పల్లవిదే అవడమే. ఫైనల్ గా సినిమాలు ఎలా ఉన్నా యూట్యూబ్ లో మాత్రం సాయి పల్లవి రికార్డులను కొట్టేవారే లేరని చెప్పొచ్చు.