రకుల్ వర్సెస్ నెటిజెన్.. గరం గరం..!

స్టార్ హీరోయిన్స్ కు ఈమధ్య సోషల్ మీడియాలో అసభ్యకరమైన కామెంట్స్ కామన్ అయ్యాయి. ఏదో సరదాగా వారితో చాట్ చేసే సౌలభ్యాన్ని కూడా చెడుగా వాడేస్తున్నారు కొందరు నెటిజెన్లు. ఇలా ఇంతకుముందు కూడా హీరోయిన్స్ సోషల్ బ్లాగ్స్ లో పర్సనల్ ఎటాక్ చేసిన సందర్భాలు ఉన్నాయి. లేటెస్ట్ గా రకుల్ ప్రీత్ సింగ్ ఓ నెటిజెన్ చేసిన వ్యాఖ్యలకు చాలా సీరియస్ అయ్యింది.

ట్రెండ్ ను ఫాలో అవుతున్న రకుల్ ఈమధ్య ఓ షార్ట్ డెనిమ్ వేర్ తో కారు నుండి బయటకు దిగి వస్తున్న పిక్ షేర్ చేసింది. అయితే అది చూసిన భగత్ అనే నెటిజెన్ కారులో సెషన్ పూర్తి చేసి ప్యాంట్ వేసుకోవడం మర్చిపోయిందని కామెంట్ చేశాడు. అయితే దానికి అదేవిధంగా సమాధానం ఇచ్చింది రకుల్. మీ అమ్మ ఎన్నిసార్లు సెన్షన్స్ చేసి వచ్చింది అంటూ అతనికి రిప్లై ఇచ్చింది. అయితే రకుల్ అతన్ని కాకుండా భగత్ తల్లిని కామెంట్ చేయడంపై కొందరు విమర్శలు చేస్తున్నారు.   

అయితే వారి కామెంట్స్ కు సమాధానంగా ఇలాంటి సిక్ మైండ్ పీపుల్ కు అలాంటి సమాధానం ఇవ్వాలని అన్నది. ఇక రకుల్ చేసిన ఈ కామెంట్స్ పై హీరో కమ్ డైరక్టర్ రాహుల్ రవింద్రన్ సపోర్ట్ గా నిలిచాడు. స్పీక్ అప్ లైక్ రకుల్ అంటూ తన సపోర్ట్ తెలిపాడు రాహుల్.