
సౌత్ లో క్రేజీ డైరక్టర్ అయిన శంకర్ 2.ఓతో ఆశించిన ఫలితాన్ని అందుకోలేదు. రోబో సీక్వల్ గా వచ్చిన 2.ఓ సినిమా బడ్జెట్ ఎక్కువవడంతో పాటుగా సినిమాపై అంచనాలు భారీగా ఉండటం వల్ల ఆ అంచనాలను అందుకోవడంలో విఫలమైంది. ప్రస్తుతం శంకర్ ఇండియన్ సినిమా సీక్వల్ గా ఇండియన్ 2 మూవీ చేస్తున్నాడు. సీక్వల్ లో కూడా కమల్ హీరోగా నటిస్తున్నాడు. అయితే ఈ సినిమాలో విలన్ గా ముందు అజయ్ దేవగన్ అనుకున్నాడట శంకర్.
మధ్యలో ఏమైందో ఏమో ఇప్పుడు అజయ్ దేవగన్ బదులు అక్షయ్ కుమార్ నే ప్రతినాయకుడిగా ఫైనల్ చేశాడట. 2.ఓలో కూడా పక్షిరాజుగా అక్షయ్ నటించాడు. సంక్రాంతి సందర్భంగా రిలీజ్ చేసిన ఇండియన్ 2 ఫస్ట్ లుక్ ప్రేక్షకులను మెప్పించింది. లైకా ప్రొడక్షన్స్ బ్యానర్ లో తెరకెక్కుతున్న ఈ సినిమా కూడా 200 కోట్ల భారీ బడ్జెట్ తో వస్తుందట. మరి ఇండియన్ 2 కమల్, అక్షయ్ ల నట విశ్వరూపం ఎలాంటి సంచలనాలు సృష్టిస్తుందో చూడాలి.