మహానాయకుడు ఫ్రీ అంటున్నారు..!

ఎన్.టి.ఆర్ జీవిత చరిత్రతో నందమూరి బాలకృష్ణ లీడ్ రోల్ లో వచ్చిన సినిమా ఎన్.టి.ఆర్ కథానాయకుడు. రెండు పార్టులుగా వస్తున్న బయోపిక్ మొదటి పార్టుగా వచ్చిన ఎన్.టి.ఆర్ కథానాయకుడు అంచనాలను అందుకోలేకపోయింది. సినిమా మొదటి రోజు టాక్ బాగున్నా ఎందుకో ఆశించిన స్థాయిలో వసూళ్లను రాబట్టలేదు. వరల్డ్ వైడ్ గా 80 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసిన ఎన్.టి.ఆర్ కథానాయకుడు మూవీ బయ్యర్లు నష్టాలను తెచ్చిపెట్టేలా ఉంది.

అందుకే ఎన్.టి.ఆర్ మహానాయకుడు నష్టపోయిన బయ్యర్లకు ఫ్రీగా ఇచ్చేస్తున్నారట. ఫిబ్రవరి 7న ఎన్.టి.ఆర్ మహానాయకుడు రిలీజ్ అవుతుంది. కాస్త కూస్తో ఎలాంటి గొడవలు లేకుండా వచ్చిన కథానాయకుడే బాక్సాఫీస్ వద్ద డీలా పడితే మహానాయకుడిపై అందరికి అనుమానాలు ఉండగా అది ఏమాత్రం అలరిస్తుందో చూడాలి. తెర మీద ఎన్.టి.ఆర్ పాత్రలో బాలకృష్ణ మెప్పించినా వసూళ్ల పరంగా మాత్రం ఎన్.టి.ఆర్ కథానాయకుడు సందడి చేయలేకపోయింది.