జనతాగ్యారేజ్ వాయిదా దాని కోసమే

వరుసగా రెండు హిట్స్ కొట్టి ఊపు మీదున్న యంగ్ టైగర్ ఎన్టీఆర్ అభిమానులకు చేదువార్త. హ్యాట్రిక్ హిట్ కొడతారని ఆశగా ఎదురు చూస్తున్న ఫ్యాన్స్ కు ఆ ఎదురు చూపులు ఇంకొన్ని రోజులు తప్పేలా లేవు. భారీ వర్షాల కారణంగా సినిమా షూటింగ్ ఆలస్యమైందని.. అందువల్ల జనతా గ్యారేజ్ ఆగస్టు 12న కాకుండా   సెప్టెంబర్ 2న విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు. తెలుగు సినిమా ఇండస్ట్రీ ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న జనతాగ్యారేజ్ వాయిదా అందరిని నిరాశపరిచింది.

సినిమాను ఎందుకు వాయిదా వేయాల్సి వచ్చిందో డైరెక్టర్ కొరటాలశివ, నిర్మాత నవీన్ లు ప్రెస్ మీట్ లో వివరాలు వెల్లడించారు. తప్పనిసరి పరిస్థితుల వల్ల, సాంకేతిక కారణాలతో జనతాగ్యారేజ్ సినిమాను వాయిదా వేస్తున్నట్లు నిర్మాతలు చెబుతున్నారు. వాయిదాపడటం తమకేమీ బాధ లేదని.. తాము అనుకున్న దానికంటే ఔట్ పుట్ గొప్పగా వచ్చిందని అంటున్నారు. ఆడియోను ఆగస్టు రెండోవారంలో రిలీజ్ చేస్తామని జనతా గ్యారేజ్ యూనిట్ ప్రకటించింది.