బయోపిక్ పై నాగబాబు కామెంట్

పవన్ ఎవరో తనకు తెలియదని చెప్పిన బాలకృష్ణని టార్గెట్ చేస్తూ మెగా బ్రదర్ నాగబాబు చేస్తున్న కామెంట్స్ తెలిసిందే. మొదట్లో ఆయన ఎవరో తెలియదని.. ఆ తర్వాత అతనో కమెడియ అని.. అలా బాలకృష్ణని ఇన్ డైరెక్ట్ గా టార్గెట్ చేస్తూ వచ్చిన నాగబాబు ఈమధ్య ఓ పిల్లాడు సారే జహాసే అచ్చా సాంగ్ పాడిన దాన్ని షేర్ చేశాడు. ఇక ఈమధ్య అలాంటివి చాలా చేస్తున్న నాగబాబు లేటెస్ట్ గా ఎన్.టి.ఆర్ బయోపిక్ ను టార్గెట్ చేస్తూ కామెంట్స్ పెట్టాడు.

కట్టు కథలు కొన్ని.. కల్పనలు ఇంకొన్ని.. చుట్టనేల.. మూట కట్టనేల.. నిజం కక్కలేని బయోపిక్కులొద్దయా విశ్వదాభి రామ వినరా మామా అంటూ నాగ బాబు పెట్టిన ఓ కామెంట్ మళ్లీ నందమూరి ఫ్యాన్స్ ను కోపాన్ని తెప్పించేలా చేస్తుంది. బాలకృష్ణ చేసింది కరెక్ట్ అయితే నాగబాబు చేసేది కరెక్ట్ అన్నట్టుగా మెగా ఫ్యాన్స్ ట్రోల్స్ చేస్తున్నారు. పర్సనల్ గా ఓకే కాని బయోపిక్ సినిమాపై నాగ బాబు దృష్టి మళ్లడంపై వివాదం ఇంకా ముదిరేలా ఉంది.