
మెగా మేనళ్లుడు సాయి ధరం తేజ్ కెరియర్ మొదట్లో జోష్ ఫుల్ హిట్లు అందుకున్నా ఆ తర్వాత వరుస ఫ్లాపులతో వెనక పడ్డాడు. 6 వరుస పరాజయాలతో తేజూ కెరియర్ సందిగ్ధంలో పడిందని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ప్రస్తుతం కొద్దిపాటి గ్యాప్ తర్వాత కిశోర్ తిరుమల డైరక్షన్ లో చిత్రలహరి సినిమా చేస్తున్నాడు సాయి ధరం తేజ్. ఈమధ్యనే సెట్స్ మీదకు వెళ్లిన ఆ సినిమా షూటింగ్ శరవేగంగా జరుపుకుంటుంది.
ఇదిలాఉంటే తెలుగులో సాయి ధరం తేజ్ కు ఫ్లాప్ ఇచ్చిన సినిమాలు యూట్యూబ్ లో మాత్రం సెన్సేషన్స్ క్రియేట్ చేస్తున్నాయి. సాయి ధరం తేజ్ నటించిన రేయ్ సినిమా హిందిలో డబ్బింగ్ వర్షన్ యూట్యూబ్ లో 9.1 మిలియన్ వ్యూస్ తెచ్చింది. ఇక్కడ హిట్టైన సుప్రీం సినిమా 28 మిలియన్ వ్యూస్ సాధించింది. అంతేకాదు జవాన్ సినిమా కూడా 38 మిలియన్ వ్యూస్ రాబట్టగా లాస్ట్ ఇయర్ భారీ అంచనాలతో వచ్చి తెలుగులో ఫ్లాపైన తేజ్ ఐలవ్యూ సినిమా కూడా 37 మిలియన్ వ్యూస్ రాబట్టిందట. చూస్తుంటే తేజూకి బన్ని లానే బాలీవుడ్ లో ఎక్కువ ఫాలోయింగ్ ఏర్పడేలా ఉంది.