అనసూయ టాటూ సీక్రెట్ లీక్..!

జబర్దస్త్ బ్యూటీ అనసూయ స్మాల్ స్క్రీన్, సిల్వర్ స్క్రీన్ అనే తేడా లేకుండా హంగామా చేస్తుంది. యాంకరింగ్ గా తన అందంతో అలరిస్తూ వెండితెర మీద మెరుపులు మెరుస్తున్న అనసూయ నెలకో క్రేజీ ఫోటో షూట్ తో ఆడియెన్స్ ను అలరిస్తుంది. ఇక తన ఫాలోవర్స్ తో ఎప్పుడు టచ్ లో ఉండే అనసూయ వారితో చిట్ చాట్ కూడా చేస్తూ ఉంటుంది. న్యూ ఇయర్ సందర్భంగా అభిమానులతో చిట్ చాట్ చేసిన అనసూయ ఓ అభిమాని అడిగిన టాటూపై నోరు విప్పింది.

అనసూయ టాటూ పై కొన్నాళ్లుగా సోషల్ మీడియాలో డిస్కషన్స్ తెలిసిందే. ఫైనల్ గా ఆ టాటూ సీక్రెట్ చెప్పింది అనసూయ. ఆ టాటూ తన భర్త పెట్ నేమ్ నిక్కూ అని అదే తను టాటూగా వేయించుకున్నా అని చెప్పింది అనసూయ. తను ప్రొఫెషన్ గురించి నెగటివ్ కామెంట్స్ చేసిన అభిమానికి ప్రస్తుతం తను చేస్తున్న పనిని ఎంతో గౌరవంగా సంతోషంగా చేస్తున్నా అంటుంది అనసూయ. అంతేకాదు తను మొదటిసారి గా అందుకున్న పారితోషికం 5,500 అని అభిమానులతో పంచుకుంది. అభిమానులతో మాట్లాడటమే కాదు వారితో తన పర్సనల్ విషయాలను షేర్ చేసుకుంటున్న అనసూయ వారి అభిమానం రెట్టింపు అయ్యేలా చేసుకుంది.