
సూపర్ స్టార్ మహేష్ వంశీ పైడిపల్లి డైరక్షన్ లో వస్తున్న సినిమా మహర్షి. భరత్ అనే నేనుతో హిట్ అందుకున్న మహేష్ కెరియర్ లో 25వ సినిమాగా వస్తున్న మహర్షి మీద భారీ అంచనాలు ఉన్నాయి. న్యూ ఇయర్ సందర్భంగా మహర్షి క్లాసీ పోస్టర్ ఒకటి రిలీజ్ చేశారు. అయితే ఆ పోస్టర్ సినిమాపై మరింత అంచనాలు పెంచింది. ఇక ఈ సినిమాపై మహేష్ పూర్తి నమ్మకంతో ఉన్నాడని తెలుస్తుంది.
ఈ సినిమా కథ భరత్ అనే నేనుకి పోలికలు ఉన్నాయని వార్తలు రాగా వాటికి స్పందించిన మహేష్ మహర్షి సినిమా తప్పకుండా మెప్పిస్తుందని.. సినిమా ప్రేక్షకులను అసలు డిజప్పాయింట్ చేయదని అంటున్నాడు. వంశీ పైడిపల్లి కూడా మహర్షి పక్కా హిట్ అంటూ చెబుతున్నాడట. దిల్ రాజు, అశ్వనిదత్ కలిసి నిర్మిస్తున్న ఈ సినిమాలో పూజా హెగ్దె హీరోయిన్ గా నటిస్తుంది.