
సూపర్ స్టార్ మహేష్ వంశీ పైడిపల్లి కాంబోలో వస్తున్న క్రేజీ మూవీ మహర్షి. దిల్ రాజు, అశ్వనిదత్ కలిసి నిర్మిస్తున్న ఈ సినిమాలో పూజా హెగ్దె హీరోయిన్ గా నటిస్తుంది. ఈ మూవీలో అల్లరి నరేష్ కూడా నటిస్తున్నాడని తెలిసిందే. సినిమాకు సంబందించి ఫస్ట్ లుక్ టీజర్ మాత్రమే వదిలారు. అందులో మహేష్ మాసీ లుక్ అదిరిపోయింది. అయితే న్యూ ఇయర్ సందర్భంగా ఓ రోజు ముందే మహేష్ తన ఫ్యాన్స్ కు కొత్త సంవత్సరం గిఫ్ట్ ఇచ్చాడు.
మహర్షి సినిమా నుండి కొత్త పోస్టర్ కొద్ది గంటల క్రితం రిలీజ్ చేశారు చిత్రయూనిట్. మహేష్ క్లాసీ లుక్ లో సూటు బూటు వేసుకుని కనిపిస్తున్నాడు. మహర్షి సినిమాలో మహేష్ డిఫరెంట్ వేరియేషన్స్ ఉన్న రోల్స్ చేస్తున్నాడని తెలుస్తుంది. దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందిస్తున్న ఈ సినిమా ఏప్రిల్ 5న రిలీజ్ ప్లాన్ చేశారు. మహేష్ 25వ సినిమాగా వస్తున్న ఈ మూవీ భరత్ హిట్ మేనియా కొనసాగించేలా చేస్తుందో లేదో చూడాలి.