పవన్ బెస్ట్ ఫ్రెండ్ షాక్ ఇస్తాడా..!

పవన్ కళ్యాణ్ బెస్ట్ ఫ్రెండ్ ఎవరు.. అతను పవన్ కు షాక్ ఇవ్వడం ఏంటని టైటిల్ చూసి కాస్త షాక్ అవ్వొచ్చు. 2019 ఎన్నికల్లో తన ముద్ర వేయాలని చూస్తున్న జనసేనాని పవన్ కళ్యాణ్ కు ఇండస్ట్రీలో కొందరు మద్ధతు పలుకగా మరికొందరు మాత్రం విమర్శలు కురిపిస్తున్నారు. ఇక లేటెస్ట్ గా పవన్ ప్రతి సినిమాలో కచ్చితంగా స్నేహితుడి పాత్రలో కనిపించే ఆలి కూడా పవన్ కు షాక్ ఇచ్చేలా ఉన్నాడని అంటున్నారు.

కొన్నాళ్లుగా ఆలి కూడా రాజకీయాల్లోకి రావాలని చూస్తున్నాడు. 2014లోనే ఆ ప్రయత్నాలు చేశాడని టాక్. అందుకే 2019లో ఎలాగైనా ఏదో ఒక పార్టీ తరపున పోటీ చేయాలని ఫిక్స్ అయ్యాడట. ఈ క్రమంలో భాగంగా వైసిపి అధినేత వై.ఎస్ జగన్ మోహన్ రెడ్డిని కలిసినట్టు తెలుస్తుంది. వైఎస్ జగన్ తో ఆలి దిగిన ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఆ ఫోటో వెనుక ఉన్న కథ ఇదే అంటున్నారు. తను లేకుంటే తన సినిమాలేదు అన్నట్టుగా చెప్పే పవన్ కు ఆలి గట్టి షాక్ ఇచ్చేలా ఉన్నాడు. మరి పవన్ ఫ్యాన్స్ ఆలి నిర్ణయానికి ఎలా రెస్పాండ్ అవుతారో చూడాలి.