సాహో సుజిత్ బన్నితో సినిమా..!

నా పేరు సూర్య తర్వాత బన్ని ఏం సినిమా చేస్తున్నాడు అనే విషయంపై అఫిషియల్ క్లారిటీ రాలేదు. దాదాపుగా బన్ని నెక్స్ట్ మూవీ త్రివిక్రంతోనే ఉంటుందని తెలుస్తుంది. అయితే ఆ సినిమా తర్వాత సినిమా గురించి కూడా ఇప్పుడే ఓ స్టెప్ వేశాడట బన్ని. బాహుబలి తర్వాత ప్రభాస్ ను డైరెక్ట్ చేస్తున్న సాహో సుజిత్ డైరక్షన్ లో బన్ని సినిమా ఉండే ఛాన్స్ ఉందట. ఈమధ్యనే అల్లు అర్జున్ ను కలిసి సుజిత్ ఓ లైన్ చెప్పాడట.

లైన్ నచ్చడంతో ఫుల్ స్క్రిప్ట్ సిద్ధం చేసుకురమ్మని చెప్పాడట. అంతేకాదు సాహో సినిమా రిజల్ట్ ను బట్టి కూడా బన్ని సుజిత్ తో సినిమా చేయాలా వద్దా అని ఆలోచిస్తాడని అంటున్నారు. ఎలాగు త్రివిక్రం సినిమాకు 6 నెలలు టైం పడుతుంది కాబట్టి ఈలోగా సాహో సత్తా ఏంటో తెలుస్తుంది. ఒకవేళ సాహో అనుకున్న రేంజ్ హిట్ అయితే మాత్రం త్రివిక్రం తర్వాత బన్ని సుజిత్ తో ఫిక్స్ అవ్వొచ్చు.