చిరు ఇలా షాక్ ఇచ్చాడేంటి..!

పదేళ్ల తర్వాత ఖైది నంబర్ 150తో రీ ఎంట్రీ ఇచ్చి తన స్టామినా ఏంటో మరోసారి చూపించిన మెగాస్టార్ చిరంజీవి తన 151వ సినిమాగా సైరా నరసింహా రెడ్డి సినిమా చేస్తున్నాడు. సురేందర్ రెడ్డి డైరక్షన్ లో వస్తున్న ఈ సినిమా కొణిదెల ప్రొడక్షన్స్ బ్యానర్ లో రాం చరణ్ నిర్మిస్తున్నాడు. ఇక ఈ సినిమా తర్వాత అసలైతే చిరంజీవి కొరటాల శివతో సినిమా చేస్తాడని అన్నారు.

ఆ సినిమా స్క్రిప్ట్ కూడా ఫైనల్ అయ్యిందని.. ఫిబ్రవరి నుండి సెట్స్ మీదకే వెళ్లబోతుందని అన్నారు.. కాని రీసెంట్ గా జరిగిన వినయ విధేయ రామ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో త్రివిక్రంతో సినిమా ఎనౌన్స్ చేశాడు. డివివి దానయ్య నిర్మాణంలో ఆ సినిమా ఉంటుందట. కొరటాల శివ సినిమా స్క్రిప్ట్ దశలో ఉన్నా ఆ సినిమా గురించి ఎక్కడా ప్రస్థావించని చిరంజీవి త్రివిక్రం సినిమా గురించి చెప్పడం ఇప్పుడు హాట్ న్యూస్ గా మారింది. ఇంతకీ కొరటాల శివతో చిరు సినిమా ఉంటుందా లేక అది క్యాన్సిల్ చేసి త్రివిక్రం సినిమా చేస్తాడా అని డౌట్ పడుతున్నారు మెగా ఫ్యాన్స్.

సైరా సినిమా ఆగష్టు రిలీజ్ ప్లాన్ చేస్తున్నారు. అరవింద సమేత తర్వాత త్రివిక్రం బన్నితో సినిమా ఫిక్స్ అయ్యాడు. సో ఎలా లేదన్నా త్రివిక్రంతో చిరు సినిమా 6 నెలల తర్వాతే అని చెప్పొచ్చు.