
టాలీవుడ్ క్రేజీ డైరక్టర్ వినాయక్ కు ఇప్పుడు సినిమా ఛాన్సులు కరువయ్యాయి. ఇంటిలిజెంట్ సినిమా తర్వాత వినాయక్ బాలయ్యతో సినిమా చేస్తాడని అన్నారు కాని బాలకృష్ణను సాటిస్ఫై చేసే కథ చెప్పడంలో వినాయక్ ఫెయిల్ అయ్యాడట. అందుకే ఇప్పుడు బాలకృష్ణని కాదని విక్టరీ వెంకటేష్ తో సినిమా చేయాలని ప్లాన్ చేస్తున్నాడట. బాలయ్యకు రాసిన కథనే కొద్దిగా మార్చి వెంకటేష్ కు చెప్పాడట.
ఆల్రెడీ వినాయక్ తో వెంకటేష్ లక్ష్మి సినిమా చేశాడు. ఆ సినిమా మంచి ఫలితాన్ని అందుకుంది. ప్రస్తుతం వెంకటేష్ ఎఫ్-2 రిలీజ్ కు రెడీ అవుతుండగా నాగ చైతన్యతో చేస్తున్న వెంకీ మామ కూడా సెట్స్ మీద ఉంది. ఆ సినిమా పూర్తయితే కాని వినాయక్ సినిమా సెట్స్ మీదకు వెళ్లే అవకాశం ఉంది. వినాయక్ తో వెంకటేష్ సినిమాపై మరిన్ని డీటైల్స్ త్వరలో తెలుస్తాయి.